పి.ఎస్.సి బోస్ డ్రైవింగ్ స్కూల్ ముసుగులో అడ్డంగా వసూళ్ల దందా

*ముడుపులు చెల్లిస్తేనే లైసెన్స్*
కృష్ణ, మార్చి 28, (నిజం న్యూస్ )
కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగ చర్ల గ్రామం నందు పి.ఎస్.సి బోస్ మెమోరియల్ డ్రైవింగ్ స్కూల్ లో ట్రైనింగ్ కి వచ్చిన వారి దగ్గర అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు తమ గోడు వెళ్ళబుచ్చుతున్నారు. ట్రైనింగు ఉచితంగా ఇవ్వాలి అని యజమాన్యం డ్రైవింగ్ స్కూల్ నీ స్థాపించడం జరిగిందని, అక్కడ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ లే ఆర్.టి.ఓ ఏజెంట్ గా వ్యవహరించి డ్రైవింగ్ నేర్చుకునే వారి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. అదేంటి అని అడిగితే ఆర్టీవో ఆఫీస్ వాళ్లే మామూలు ఇవ్వకపోతే లైసెన్స్ ఇవ్వరు అని అంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెవీ లైసెన్స్ కావాలి అంటే 25 వేలు నుంచి 40,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని, ట్రైనింగ్ కి రాకపోయినా పర్వాలేదు కానీ 25,000 ఇవ్వాలి అని వారిని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.కనీసము ఎల్.ఎం.వి లైసెన్స్ లేని వారికి కూడా హెవీ లైసెన్స్ ఇస్తారని వారిని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. డి టి సి లో హెవీ లైసెన్స్ అప్లై చేసుకున్న వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి పర్మిషన్ కి పంపిస్తారు. అలా పర్మిషన్ వచ్చిన వారికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. వారినే అటెండెన్స్ రిజిస్టర్ లో వారి పేర్లు రాసి ఆర్టీవో దగ్గర అటెండెన్స్ వేస్తారు. కానీ ఐ.ఎం.వి లైసెన్స్ లేని వారిని కూడా ఆ రిజిస్టర్ యందు పేరు నమోదు చేసి ఆర్టీవో వారితో సంతకాలు చేయించారు. కనీసం వెరిఫికేషన్ కూడా చేయకుండా ఆర్టీఓ మరియు అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతకాలు చేయటం హాస్యాస్పదం. హెవీ లైసెన్స్ కావాలి అంటే డి టి సి ఆఫీసు నందు పర్మిషన్ లు ఏమీ లేకుండా వారం రోజుల్లో సర్టిఫై చేసి ట్రయిల్ వేయించి లైసెన్సు ఇప్పిస్తున్నారు. లేదా డి టి సి ఆఫీసు నందు వచ్చి నా పర్మిషన్ లో ఉన్న పేరును తొలగించి వారికి డబ్బులు ఎక్కువగా ఇస్తున్నా వారిని ఆ లిస్టులో వీరు సొంతంగా అధికంగా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు ఎక్కించి లైసెన్సు ఇప్పిస్తున్నారు. ముందు ఒక ఫీజు అనుకోని తర్వాత అంతకు మించి ఫీజు అడుగుతున్నారు. అది ఇవ్వని పక్షంలో వారిని రావద్దని ఇంటి దగ్గరే ఉండిపొమ్మని వెనుకకు పంపుతున్నారు. ట్రయిల్ వెయ్యాలి అంటే ముందుగా ఆర్టీవో ఆఫీస్ లో ముడుపులు చెల్లించాలి అని, మీరు ఆ మొత్తం ఎమౌంట్ ని కట్టాలని వాళ్ల దగ్గర డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. లేకపోతే మీకు మీ లైసెన్సులు ఇవ్వమని వారిని బెదిరిస్తున్నారు. ఈ విషయాలు బయటకు చెబితే నీ లైసెన్సులు రద్దు చేపిస్తాను అని, నీకు లైసెన్సులు రాకుండా చేస్తామని ఆర్డీవోలు మా మాటే వింటారు అని, డ్రైవింగ్ నేర్చుకునే వారిని డ్రైవింగ్ స్కూల్ వారు బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో లైసెన్స్ ట్రైల్ వేసిన వ్యక్తి దగ్గర హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు గాను ఫైన్ కింద 2500 ఆర్టీవో అడుగుతున్నారు అని 2500 రూపాయలు వసూలు చేశారు. ఐ.ఎమ్.వి లైసెన్స్ కూడా లేని వ్యక్తి దగ్గర నీకు హెవీ లైసెన్స్ ఇప్పిస్తానని దానికి 10 వేల రూపాయలు ఖర్చవుతుందని డబ్బులు వసూలు చేశారు. ఇదేవిధంగా ఈ స్కూల్ లోనే కాకుండా అన్ని స్కూల్ లో పరిస్థితి ఇలానే ఉందా లేదా అనే విషయం తెలియాలి అంటే వీరి యొక్క అన్ని రికార్డులను ఆర్టీవో డిపార్ట్మెంట్ వారు వెరిఫికేషన్ చేసి అలా తప్పుచేసిన వారిని ఆ స్కూలు పై క్రమశిక్షణ చర్యల కింద ఆ స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలని బతకటానికి డ్రైవింగ్ నేర్చుకునే అభాగ్యులకు న్యాయం జరిపించాలని, ఏజెంట్లుగా వ్యవహరించి ఆ బాధ్యులపై జరుగుతున్న దోపిడీని ఆపాలని, ఆర్టీవో ఇప్పటికైనా కళ్లు తెరిచి స్కూల్ లో జరుగుతున్న అన్ని విషయాలలో వారు వెరిఫై చేసుకొని తప్పు చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోయారు.