యాదాద్రి కు చేరుకున్న సీఎం కేసీఆర్

యాదాద్రి కు చేరుకున్న సీఎం కేసీఆర్…..

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 28(నిజం న్యూస్)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి ఆలయ పునః ప్రారంభ ఉత్సవాలలో పాల్గొంటారు. ఈరోజు ఉదయం ఆయన కుటుంబ సమేతంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదాద్రికి బయలు దేరిన పెద్ద గుట్టపై ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకున్నారు. అనంతరం ఆయన ప్రధాన ఆలయం, పరిసరాల ఏర్పాట్లను పరిశీలించారు. యాదాద్రి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ఉదయం 11.55 గంటలకు జరిగే మహాకుంభ సంప్రోక్షణ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12. 10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన చేస్తారు. 12. 20 నుండి 12. 30 వరకు శ్రీ స్వామివారి గర్భాలయ దర్శించుకుంటారు.