టైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన పెండెం ఆకర్ష్

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 37(నిజం న్యూస్)
తుర్కపల్లి టైక్వాండో లో విజయం సాధించిన ఆకర్ష్
ఫోటో రైట్ అప్02 తుర్కపల్లి టైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన ఆకర్ష్
హర్యానా రాష్ట్రంలో రోహమాల్ జిల్లా మేహం తాలూకాలో జరిగిన ఎనిమిదవ జాతీయ విద్యార్థి ఒలంపిక్స్ 2021- 22 టైక్వాండో క్రీడలో తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన పెండెం ఆకర్ష్ మొదటి బహుమతి గోల్డ్ మెడల్ సాధించారు. పెండెం ఆకర్ష్ యాదగిరిగుట్ట గౌతమ్ స్కూల్ లోఏడవ తరగతి చదువుతున్న ఆకర్ష్ గత మూడు సంవత్సరాల నుండి మాస్టర్ సాయి శిక్షణలో నవంబర్ 2021 లో గోవాలో నిర్వహించిన నేషనల్ యూత్ టైక్వాండో లో గోల్డ్మెడల్ సాధించి ఇంటర్నేషనల్ కు సెలక్ట్ అవ్వడం జరిగింది.
also read: కానిస్టేబుల్ రాజశేఖర్ కు జాతీయ స్థాయి పురస్కారం
అనంతరం మార్చి 2022 లో తెలంగాణ స్టేట్ ఓపెన్ టైక్వాండో చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ నెల 27న హర్యానా రాష్ట్రంలో లో ఎనిమిదవ జాతీయ విద్యార్థి ఒలంపిక్స్ లో టైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మండలము, జిల్లా, రాష్ట్రానికి చెందిన పలువురు ఆకర్ష్ నూ అభినందించారు.రాబోవు కాలంలో మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి ,దేశానికి పేరు తీసుకురావాలని అని పలువురు అభినందించి, సహకరించిన వారిలో తెలంగాణ స్టూడెంట్ ఒలంపిక్స్ అసోసియేషన్ తైక్వాండో తెలంగాణ జనరల్ సెక్రెటరీ సుదర్శన్ గౌడ్,టైక్వాండో తెలంగాణ ఇంచార్జ్ హనుమంత్,మేనేజర్ పి రాజ్ కుమార్ పలువురు ఉన్నారు.