అల్లూరు గ్రామంలో మహిళపై హత్యాయత్నం

కృష్ణ, మార్చి 27, (నిజం న్యూస్ )
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన వివాహిత చింకా గౌరీ పై హత్యాయత్నం, ఆస్పత్రికి తరలింపు. ఎర్రం శెట్టి లక్ష్మీనారాయణ సైకోలా వ్యవహరించి అతి కిరాతకంగా మహిళపై గొంతు,ఉదర భాగం, చేతులపై విచక్షణ రహితంగా కిరాతకంగా హత్య చేయడానికి ప్రయత్నించాడు.
గౌరీ అనే మహిళ ఇంటి నందు పనులు చేసుకుంటున్న సందర్భంగా సందర్భంలో, భర్త ఇంటి పనులు నిమిత్తం కిరాణా షాప్ కు వెళ్లిన సందర్భంలో , ఇంటి నందు ఎవరూ లేరని గమనించిన సైకో ఇంట్లో చొరబడి అతి దారుణంగా విచక్షణా రహితంగా దాడి చేశాడు.
also read: కొడుకు చేతిలో తండ్రి హతం
అదే సమయంలో బాధిత మహిళ కేకలు వేయడంతో ఆ ఇంటి సమీపాన ఉన్న చుట్టుపక్కల వారు వెళ్లేసరికి అతని చేతిలో కత్తి, రక్తపు మడుగులో ఉన్న మహిళలు చూసి భయభ్రాంతులయ్యారు. ఎవరైనా నా జోలికి వస్తే ఆమెకు జరిగిన అయితే అందరికీ పడుతుందని పెద్దగా అరుస్తుందటంతో ఇరుగు పొరుగు వారు ఎవరు ముందుకు వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఇతను హత్య ప్రయత్నం చేసి దర్జాగా నడుచుకుంటూ సమీపంలో ఉన్న బస్టాండ్ దగ్గరికి వెళ్లడంతో గ్రామస్తులు వీరులపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.