ప్రముఖుల రాక సందర్భంగా జిల్లా అధికారులకు బాధ్యతలు-జిల్లా కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 27(నిజం న్యూస్)
ఈనెల 28వ తేదీ సోమవారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సప్తాహ్నిక పంచకుడాత్మక సహిత మహా కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా వచ్చే ప్రముఖుల వసతి ఏర్పాట్లకు సంబంధించి ప్రోటోకాల్ లైజనింగ్ ఆఫీసర్స్ గా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
also read: RRR మొదటి రోజు నైజాం ఏరియాలోనే 23.3 కోట్ల కలెక్షన్స్.
అతిధి గృహాలలో ప్రముఖుల రాక సందర్భంగా వారికి అందించే వసతి ఏర్పాట్లు సమీక్షిస్తూ పకడ్బందీగా బాధ్యతలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాసరెడ్డి,జిల్లా పరిషత్ సిఇఓ కృష్ణారెడ్డి,భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారులు భూపాల్ రెడ్డి, సూరజ్ కుమార్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, కలెక్టరేట్ ఏవో నాగేశ్వర చారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.