కానిస్టేబుల్ రాజశేఖర్ కు జాతీయ స్థాయి పురస్కారం

రాజన్న సిరిసిల్ల, మార్చి27 (నిజం న్యూస్):
వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ కి తాను చేస్తున్న సమాజ సేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన జయ జయ సాయి ట్రస్ట్ వారు శనివారం రాత్రి హైదరాబాద్ లో తెలంగాణా సారస్వత పరిషత్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయి పురస్కారం ను సినీ దర్శకులు బాబ్జి, సినీ ఆర్టిస్ట్ జెన్నీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొలిటికల్ స్ట్రాటజీ సర్వే మస్తాన్, హిస్టరీ అకాడమీ చైర్మన్ సుబ్బాయమ్మ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పూర్వ రిజిస్టర్ త్రిమూర్తుల గౌరీ శంకర్, ఇతర అతిధుల చేతుల మీదుగా అందించి అభినందించారు.
also read: 80,000 ఉద్యోగాలే లక్ష్యం
ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యత తనకి ప్రథమం అని ఉద్యోగంతో పాటు కొంత సమయాన్ని సమాజానికి తన వంతుగా సేవ చేస్తున్నాను అని, ఉన్నతాధికారుల సహకారం మరువలేనిది అని, గుర్తింపు కోసమో, అవార్డ్స్ కోసమో కాదని సమాజ సేవ చేయటం తన బాధ్యత అని, సమాజ సేవ చేయటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, సమాజ సేవ తనకి ఆత్మ సంతృప్తి ని ఇస్తుంది అని ఇలాంటి పురస్కారాలు భాద్యత ని మరింత పెంచుతాయి అని, నాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి ఈ అవార్డు అకింతం అని, నా సేవను గుర్తించి ఈ అవార్డుని అందించిన ట్రస్ట్ చైర్మన్ బాలాజీ కి కృతజ్ఞతలు తెలియజేసారు.