600 కేజీల గంజాయి పెట్టివేత…

భద్రాచలం మార్చి 26 నిజం న్యూస్ )ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు, ఏ ఈ ఎస్ కిరణ్ సూచనలతో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సిఐసర్వేశ్వర్ ఆధ్వర్యంలో శనివారం భద్రాచలం పట్టణము అంబేద్కర్ సెంటర్,డిగ్రీ కాలేజ్, బ్రిడ్జి రోడ్,చెక్ పోస్ట్ లలో వాహనాల తనిఖీ చేయగా అశోక్ లేల్యాండ్ వాహనంలో ఎండు గంజాయిని ఒడిశా రాష్టం నుండి బీదర్ (కర్ణాటక రాష్ట్రం)కు రవాణా చేస్తున్న రాథోడ్ లక్ష్మణ్ అనే వ్యక్తి నుండి 600 కేజీల ఎండు గంజాయి ని 300 ప్యాకెట్స్ లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.
నిండుతుడిని అదుపులోకి తీసుకుని , తదుపరి చర్యలు నిమిత్తం వ భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సర్వేశ్వర్ తెలిపారు. పట్టుకున్న ఎండు గంజాయి విలువ మార్కెట్ కోటి ఉంటుందని అని తెలిపారు.ఇట్టి తనిఖీ లోఎస్సై ముభాషీర్ అహ్మద్హెడ్ కానిస్టేబుల్స్ కరీం,బాలు,కానిస్టేబుల్స్ సుధీర్, హరీష్,వెంకటేష్ ,విజయ్ లు పాల్గొన్నారు.