RRR మొదటి రోజు నైజాం ఏరియాలోనే 23.3 కోట్ల కలెక్షన్స్.

రాజమౌళి సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. చాలా కాలం తరువాత, RRR నిన్న గ్రాండ్ రిలీజ్ అయ్యింది మరియు అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ మౌత్ టాక్ మరియు రివ్యూలను అందుకుంటుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఈ వీకెండ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
అధికారిక సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు నైజాం ఏరియాలోనే 23.3 కోట్ల రూపాయలను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నైజాం ఏరియాలో బాక్సాఫీస్ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇదే కొనసాగితే టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పడం ఖాయం అంటున్నారు సినీ విమర్శకులు, విశ్లేషకులు.