బస్సు బ్రేకులు ఫెయిల్.. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

బస్సు బ్రేకులు ఫెయిల్.. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు!
బస్సు ఫిట్నెస్పై నిర్లక్ష్యం, వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్.
సూర్యాపేట, మార్చి 26 నిజం న్యూస్
సూర్యాపేట నుండి బొంబాయి కి బయలుదేరిన ఎక్స్ప్రెస్ బస్సు, కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి, ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో, పిల్లలమర్రి సమీపములో డ్రైవర్ చాకచక్యంతో బస్సు ఆపారు. దీనితో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా సూర్యాపేట నుండి బొంబాయి కి పోవాలంటే సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణికుల ప్రయాణించవలసి ఉన్నది. ఈ బస్సు యొక్క పనితీరు, ఫిట్నెస్ బాగుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత డ్రైవర్లు, సిబ్బందిపై ఉండగా, పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం మూలంగానే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇబ్బంది వాటిల్లినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. జరిగిన సంఘటనపై టి ఎస్ ఆర్ టి సి కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తక్షణమే ప్రయాణికులకు, అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.