ఆటో బోల్తా … తల్లి, బిడ్డ మృతి
ఆటో బోల్తా …ఇరువురు మహిళలు మృతి!
ఆటో అతివేగంతో ప్రయాణించడమే, కారణం అంటున్న స్థానికులు.
ఎక్స్ రోడ్ తండాలో అలుముకున్న విషాదఛాయలు.
తుంగతుర్తి ,మార్చి 26 నిజం న్యూస్
ఆటో బోల్తా పడి తీవ్రగాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తల్లి, బిడ్డ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కాశీ తండాలో, శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రావులపల్లి ఎక్స్ రోడ్ తండాకు చెందిన, గూగు లోతు మంగమ్మ 58, శారద లు తండాకు పోతుండగా, శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో, అతివేగంతో ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడగా, ఇరువురు తీవ్రగాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ, మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు . దీనితో తండలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. జరిగిన సంఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ వో ఆంజనేయులు తెలిపారు.