సీఎం కేసీఆర్‌తో టీఎస్ మంత్రులు భేటీ

మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు.
కేంద్ర మంత్రితో భేటీ అయిన సందర్భంగా తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వరి మొత్తం సేకరించాలని మంత్రులు పీయూష్‌ను కోరారు. దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని తీసుకురావాలని కూడా అభిప్రాయపడ్డారు. వరి కొనుగోళ్లపై మంత్రులతో భవిష్యత్ కార్యాచరణపై సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డున నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని ఆయన సమీక్షించనున్నారు.