ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి ఆధ్వర్యంలో ‘ఉచిత తాగునీరు శిబిరం’ ప్రారంభం.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి 25(నిజం న్యూస్)

ఆలేరు పట్టణంలో స్థానిక జామియా మస్జీద్ ఆవరణంలో ”ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి ”ఆధ్వర్యంలో ఉచిత తాగునీరు శిబిరాన్ని ప్రారంభించిన సంస్థ అధ్యక్షులు ఖాజీ అబ్దుల్ సమద్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా ఆలోచన చేసి బాటసారులకు,ప్రయాణికులకు,ఉచిత తాగునీరు శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ సంస్థ ద్వారా అనేకమైన సామాజిక, సేవా కార్యక్రమాలు చేపడుతున్నసమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి సభ్యులు హాఫిజ్ ఎజాజ్, షాబుద్దీన్,సాజిద్ ముజాహిద్, మోహసిన్ తదితరులు పాల్గొన్నారు.