మల్లు స్వరాజ్యం ఈ తరానికి ఆదర్శ మహిళ!

మల్లు స్వరాజ్యం మృతి ,తెలంగాణ ప్రాంతానికి తీరని లోటు.
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్.
తుంగతుర్తి ,మార్చి 25 నిజం న్యూస్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సిపిఎం పార్టీ ముద్దుబిడ్డ మల్లు స్వరాజ్యం గారు ఈ తరానికి ఒక ఆదర్శ మహిళ అని ఆమె ఆశయాల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ బడుగు బలహీనవర్గాల కోసం పని చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బుర్ర శ్రీనివాస్ అన్నారు .
స్థానిక తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముందుగా స్వరాజ్యం గారి ఇ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు 12 సంవత్సరాల వయసు నుండి అలుపెరగకుండా ఎన్నో నిర్బంధాన్ని ఎదుర్కొని ఒక భూస్వామి కుటుంబంలో జన్మించినప్పటికీ నిత్యం కష్టజీవుల బాగుకోసం వెట్టి నుండి విముక్తి చేయడం కోసం తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి తో తుపాకి పట్టుకొని రాణి రుద్రమదేవి మాదిరిగా పోరాటం చేసిందని అన్నారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాపత్రయ పడిందని అన్నారు.
చివరి పది సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను చూసి ఎంతో ఆవేదన చెందిందని అన్నారు బూర్జువా భూస్వాముల చేతిలో కష్ట జీవుల బతుకులు ఉన్నాయని ఎంతోమంది పోరాటంతో సాధించిన స్వాతంత్రాన్ని తిరిగి డబ్బు మందు బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తిరిగి కార్పొరేట్ శక్తులకు ఈ దేశం తాకట్టు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసిందని అన్నారు మల్లు స్వరాజ్యం గారి ఆత్మకు శాంతి జరగాలని ని కోరుతూ ఏప్రిల్ 3వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గ స్థాయిలో ఆమె సంతాప సభ జరుగుతుందని దీనికి అందరూ హాజరై ఆమెకు నివాళులు అర్పించాలని కోరారు .
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శంకర్ రెడ్డి యాక లక్ష్మి మండల కార్యదర్శులు వజ్జే శీను భాస్కర్ ఉప్పలయ్య మరియు ఓరుగంటి అంతయ్య దేవరాజు గడ్డం ఎల్లయ్య బోనాల వెంకన్న ముత్తయ్య నాగయ్య వెంకన్న దేవరకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు