అదనపు కలెక్టర్ హేమంత్ కుమార్ పాటిల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి!

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చల్ల మల్ల నరసింహ.

సంచార జాతుల జాతీయ బోర్డు మెంబర్, తుర్క నరసింహ పై దుర్భాషలాడటం తగదు.

సూర్యాపేట ,మార్చి 25 నిజం న్యూస్

ఈరోజు ఉదయం 11 గంటలకు కు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చల మల్ల నర్సింహ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఏ ప్రభుత్వాలు చేయలేని ప్రయత్నంలో భాగంగారెండోసారిఅధికారంలోకివచ్చినతర్వాతప్రధాని నరేంద్ర మోడీ బీసీలలో ఇంకా బాగా వెనుకబడిన కులాలు అయినా గంగిరెద్దుల దొమ్మర వడ్డెర మందుల బుడగజంగాలు వగైరా 60 కులాలు సంచార జాతుల వారి సంక్షేమం గురించి ఎస్సీ ఎస్టీ బిసి కమీషన్ల మాదిరిగానే జాతీయ సంచార జాతుల బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ లో ఎస్సి కులాలలోని సింధు డక్కలి మాస్టిన్ దాసరి మొదలగు కింది కులాల అభివృద్ధి కోసం , ఎస్ టి కేటగిరిలో నక్కల, పిట్టల యానాది మొదలగు కులాలలో అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇదేవిధంగా బీసీ కులాల లోని సంచార జాతుల వారికి మొదటి దపా లో భాగంగా బీసీ కులాల లోని బాగా వెనుకబడిన కులాల అభివృద్ధికై రెండు వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించడం జరిగింది.

తేదీ.16- 2- 2022 నాడ ఢిల్లీలో సంచార జాతుల బోర్డు సమావేశం అయి పైలెట్ ప్రాజెక్టు కింద వంద శాతం సబ్సిడీతో కూడుకున్న కొన్ని స్కీములు డిజైన్ చేయడం జరిగింది ఇవి వెబ్సైట్లో పెట్టడం కూడా జరిగింది ఈ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియజేయుటకు ఈ బోర్డు నెంబర్ అయినా ఐదు రాష్ట్రాల ఇంచార్జి మన సూర్యాపేట జిల్లా వాసి తుర్క నరసింహ గారు కలెక్టర్ కు లెటర్ పెట్టి వారి ఆహ్వానం మేరకు కలెక్టర్ ఆఫీస్ కు ఈనెల 23వ తేదీన రావడం జరిగింది

.కలెక్టర్ గారు విధినిర్వహణలో భాగంగా ఆఫీసులో లేకపోవడం వల్ల కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్ హేమంత్ కుమార్ పాటిల్ చంబర్ లోకి పోవడం జరిగింది. వచ్చే రావడమే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్, జైనింగ్ రిపోర్టు ,గెజిట్ వగైరా లాంటివి చూపించమని అడగగా అవి అన్నియు నరసింహ గారు చూపించారు అయినా వెంటనే ఇవన్నియు అబద్ధమని మీడియాను పోలీసు వారిని పిలిచి ఇతను ఫేక్ అని కేస్ బుక్ చేయమని ఆదేశించడం , దురదృష్టమైన చర్యగా అభివర్ణించారు. ఒక బీసీ వర్గానికి చెందిన సంచారజాతుల జాతీయ బోర్డు సభ్యులు అయినా తుర్క నరసింహ గారిని ఈ రకంగా అవమానపరచడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ వర్గాల వారందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలి అని కోరుచున్నాను.

ఇతనిపై రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని అని డిమాండ్ చేస్తున్నాను ఈ విషయంపై సంచార జాతుల జాతీయ చైర్మన్ కు అక్కడ నుండే ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది .అతను వెంటనే తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ కు ఫోన్ చేయగా అతను జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేశాడు. వెంటనే అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ మరియు పోలీసు వారు మీడియా ముందు నుండి తప్పించుకున్నారు.

ఈ విషయం గురించి మేము తుర్క నరసింహ గారిని అడగగా కేంద్ర ప్రభుత్వానికి ,సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు ,ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ లకు ,మానవ హక్కుల కమిషన్ కు అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తాం అని చెప్పినాడు ఇప్పటికే ఫోన్ ద్వారా మౌలికంగా చెప్పడం జరిగిందన్నారు. రాతపూర్వకంగా అందిన తర్వాత అదనపు కలెక్టర్ హేమంత్ పైతీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆన్నారని మాకు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతులకు కేంద్రం ప్రవేశపెట్టిన 100% సబ్సిడీ స్కీమ్ లను కలెక్టర్ల ద్వారా ప్రచారం చేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరుచున్నాను.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్ ,జిల్లా ఉపాధ్యక్షులు కందాల భాస్కర్, నియోజకవర్గ అధ్యక్షులు మట్ట రమేష్ యాదవ్ ,బీసీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ నిద్ర సంపత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.