వైయస్సార్ టీపీ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఆదేర్ల శ్రీనివాసరెడ్డి నియామకం

వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఆదేర్ల శ్రీనివాస్ రెడ్డి నియమిస్తూ వైయస్సార్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల శుక్రవారం నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో వైయస్సార్ టీపీ ని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్దే తన పార్టీ ని గెలిపిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.