ప్రైవేట్ పనులకు, పంచాయతీ సిబ్బంది భావ్యమా ?
- ఆ ఊరు లో సర్పంచ్ భర్త దే పెత్తనం బాబోయ్.
నూతనకల్ మార్చి 25 (నిజం న్యూస్)
గ్రామ పంచాయతీ సిబ్బంది ని ప్రభుత్వ పనులకు కాకుండా ప్రైవేట్ పనులకు సర్పంచ్ లు వాడుకుంటున్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడం, చెత్త ఎత్తి వేయడం, మంచి నీరు సరఫరా చేయడం, తదితర పనుల కోసం ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ కి సిబ్బంది ని నియమించింది. వారిని కొంత మంది సర్పంచ్ లు తమ ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ పనులకు ఉపయోగించుకొంటున్నారు.
శుక్రవారం మండల పరిధిలోని మాచనపల్లిలో కాంట్రాక్టర్ డ్రైనేజీ కాలువ నిర్మించాడు దానికి ఇరు వైపుల మట్టి పోయాల్సి ఉండగా దానిని సిబ్బంది చేత పోయిస్తున్నారు.ఆ గ్రామంలో సర్పంచ్ మహిళ కాగా ఆమె భర్త నే పెత్తనం చెలయిస్తున్నాడు.కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోని సిబ్బంది చేత పనులు చేపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా గ్రామంలో ఇటీవల పోసిన సీసీ రోడ్లు సైతం నాణ్యత లేకుండా పోషినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇప్పటి కైనా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.