30 నిమిషాల్లో 30 టూవీలర్స్ పట్టివేత!

మీ యాక్సిడెంట్ లకు మీరే బాధ్యులు, టౌన్ సిఐ ఆంజనేయులు.
జిల్లాలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల జోరు.
వాహనదారులకు అవగాహన, స్ట్రాంగ్ వార్నింగ్.
సూర్యాపేట, మార్చి 25 నిజం న్యూస్:
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సరైన పత్రాలు మరియు నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది, అందువల్ల ముఖ్యంగా జిల్లాలో నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించడం పోలీసులకు ఇబ్బంది కరమవడంతో శుక్రవారం ఉదయం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ ఎస్సై నరేష్ ముప్పై నిమిషాలు స్పెషల్ డ్రైవ్ లో వాహనదారులను ఆపి పరిశీలించగా సుమారు ముప్పై మంది నెంబర్ ప్లేట్, ఇన్సూరెన్స్, హెల్మెట్ లేని వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. అరగంటలో ఇంతమంది నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే, మరి ఒక్కరోజులో ?..
టౌన్ సిఐ ఆంజనేయులు చేరుకొని వాహనదారులకు పూర్తి అవగాహన కల్పించి, మరోసారి నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు రోడ్డెక్కితే కఠిన శిక్షలకు భాద్యులవుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై పడిశాల శ్రీనివాస్,పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్,సిబ్బంది పాల్గొన్నారు…