సూపర్ వాస్మల్ హైర్ డై తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం.!

పోలీసుల వేధింపులకు కారణం అంటున్న సాగర్.
మంచిర్యాల, మార్చ్ 25 ,నిజం న్యూస్
తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన గుర్రం సాగర్ అనే యువకుడు సూపర్ వాస్మల్ హైర్ డై తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒక కేసు విషయంలో తాండూర్ సీఐ జగదీష్, ఎస్ఐ కిరణ్ కుమార్ లు నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నా చావుకు వారే కారణమని సెల్ఫీ వీడియో లో ఉంది. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దవాఖానాల్లో సాగర్ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.