పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ పోలీస్స్టేషన్లో నిరసన

పోలీసుల అక్రమ అరెస్టులకు బిజెపి నాయకులు భయపడరు.
భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లె పాక సాయిబాబ.
తుంగతుర్తి, మార్చి 25 నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ,బడుగు బలహీన వర్గాల ప్రజల పై, కరెంటు చార్జీలు పెంచడం, సామాన్య ప్రజలకు భారంగా మారిందని సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లె పాక సాయిబాబ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను , కావాలనే పోలీసులు అక్రమ అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. దీనితో పోలీస్ స్టేషన్ లోనే ప్రభుత్వ వ్యతిరేకంగా, నినాదాలు చేయడం గమనార్హం. ప్రజా సమస్యలపై తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు కత్తుల నరేష్, మండల నాయకులు పులిపలుపుల సైదులు గౌడ్, బొంకురి మధు, బొంకురి నవీన్, పో డ్డేటి సాయి కృష్ణ, మెంత బోయిన గణేష్, తదితరులు పాల్గొన్నారు