తిరుమలగిరి వద్ద బస్సులో 12 కేజీల గంజాయి పట్టివేత ఇరువురి పై కేసు నమోదు!

నాగారం సిఐ రాజేష్.
తిరుమలగిరి, మార్చి 24 (నిజం న్యూస్):
తిరుమలగిరి వద్ద బస్సులో అక్రమంగా ఇరువురు వ్యక్తులు, 12 కేజీల గంజాయిని తీసుకో వెళుతున్నట్లు సమాచారం మేరకు తిరుమలగిరి సీఐ రాజేష్ తన సిబ్బందితో హుటాహుటిన వెళ్లి, తనిఖీలు నిర్వహించారు. దీనితో ఒడిస్సా నుండి ఖమ్మం మీదుగా ఇరువురు వ్యక్తులు తిరుమలగిరి చేరుకున్నారు.
మీరు బస్సులో ఎక్కి హైదరాబాదుకు చేరుకోవాల్సి ఉండగా సమాచారం మేరకు సీఐ రాజేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి వారిని అరెస్టు చేసి విచారణ జరపగా ఒడిశాకు చెందిన కబీ బిడ్డిక, రమేష్ బిడ్డిక లుగా గుర్తించారు.12 కేజీల కు సుమారు 2 లక్షల 50 వేలు, విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇరువురి పై కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ రాజేష్ తెలిపారు.