7 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు
– ఎస్ఐ సీమ ఫర్హీన్
నెక్కొండ మార్చి24(నిజం న్యూస్):
ఉదయం ఉదయం 10 గంటల సమయంలో నెక్కొండ మండలంలోని సాయిరెడ్డిపల్లి గ్రామంలో ఓ కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ చేసిన 7 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిలో 1, ఓరుగంటి అశోక్ (కోళ్ల ఫారం యజమాని), 2. జాటోత్ చిన్నయకూబ్, 3. జటోత్ హచ్చు అనే ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుందని ఎస్ఐ సీమ ఫర్హీన్ ఒక ప్రకటనలో తెలిపారు.