Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అవమానం తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసిన డాక్టర్ ఉషారాణి

కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తనతో కలత చెందిన మహిళ డాక్టర్ ఉషారాణి!

ఫిర్యాదు చేసినా పట్టించుకోని ,వైద్యాధికారులు

అవమానం తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసిన డాక్టర్ ఉషారాణి.

సూర్యాపేట, మార్చి 24 నిజం న్యూస్

ఆసుపత్రిలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది దురుసు తనం,ఆమహిళఆడాక్టర్కుఆవేదనకలిగించిందఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలత చెంది అవమానభారంతో రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం కు గురువారం తన రాజీనామా పత్రాన్ని అందజేసింది.

వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారిగా పని చేస్తున్న డాక్టర్ ఉషారాణి పట్ల , అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సీవో ఉపేందర్ దురుసుగా ప్రవర్తించాడు.

విధులకు సక్రమంగా రానందుకు సృష్టించిన డాక్టర్ పై దురుసుగా ప్రవర్తించిన డిఫెండర్ తీరును ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. తాను ఫిర్యాదు చేసే సమయంలో డీఎంహెచ్వో , డిప్యూటీ డీఎం హెచ్వో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. స్పందించిన కలెక్టర్ విచారణ చేయాల్సిందిగా ఉన్నత అధికారులను ఆదేశించారు. దీంతో డీఎం హెచ్వో సీసీ అర్బన్ హెల్త్ సెంటర్కు వచ్చి కలెక్టర్ కు ఎందుకు ఫిర్యాదు చేశావు అంటూ ప్రశ్నిస్తూ తనకు సంబంధం లేని విషయాలపై డాక్టర్ ను వేధింపులకు గురిచేశాడని సదరు డాక్టర్ ఆరోపించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేయగా విచారణ చేస్తామని చెబుతూ దాటవేస్తున్నారన్నారు.

కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చే విలువ మెడికల్ ఆఫీసర్కు ఇవ్వడం లేదని కలత చెందిన డాక్టర్ ఉషారాణి తన విధులకు రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం కు రాజీనామా పత్రాన్ని అందజేసింది. ఈ విషయమై వైద్యాధికారిని వివరణ కోరగా ,పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఏది ఏమైనా ప్రభుత్వ దవాఖానాల్లో మహిళా డాక్టర్ కె ఈ విధమైన సంఘటన జరగడం బాధాకరమైన విషయం, తక్షణమే జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అవసరమైతే కేసు నమోదు చేయాలని, స్థానిక మహిళలు, వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు.