మిర్యాలగూడ ప్రవేట్ స్కూల్ లకు ఒక్కపూట బడి నిబందన వర్తించదా?

మిర్యాలగూడ ప్రవేట్ స్కూల్ లకు ఒక్కపూట బడి నిబందన వర్తించదా?

*ప్రబుత్వ నిబందన బేఖాతర్.పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.*

మిర్యాలగూడ మార్చి 24.(నిజంన్యూస్): మిర్యాలగూడ ప్రవేట్ స్కూల్ లకు ఒక్కపూట నిబందన వర్తించదా!.ఎండకాలం కావడంతో విద్యార్దుల ఆరోగ్య దృష్ట్య ఒక్క పూట బడి పెడుతుంటారు.

కానీ ప్రబుత్వ నిబందనను బేఖాతర్ చేస్తూ రెండు పూటలా స్కూళ్ళను నడిపిస్తున్న కొన్ని ప్రవేట్ స్కూల్స్.

విద్యశాఖ అధికారులు అటు వైపు కూడా చూడక పోవడం తో యదేచ్చగా ఒక్కపూట నిబందనను తుంగలో తొక్కుతున్నారు.

ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రబుత్వ నిబందనలు పాటించని వారిపై చర్యలు తీసుకొని,ఒక్క పూట బడి నిబందన పాటింప చేయాలని విద్యార్దుల తల్లితండ్రులు కోరుచున్నారు.