పెరిగిన గ్యాస్, డీజిల్ ధరలకు నిరసనగా భగ్గుమన్న బానుపురి మహిళా లోకం!

- కేంద్రప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా నడుం బిగించిన నారీ లోకం
- ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్ల-కార్డుల ప్రదర్శన
- గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు పోరాటం కొనసాగుతోందంటూ మహిళల హెచ్చరిక.
- కొత్త బస్ స్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబోమ్మను దగ్దం చేసిన మహిళలు
- మోడీ పై మహిళల మరో తిరుగుబాటు అంటూ మహిళల నినాదాలు
- దిక్కులు పిక్కటిల్లేలా మహిళల నినాదాలు
సూర్యాపేట మార్చి 24 (నిజం న్యూస్)
పెరిగిన గ్యాస్, డీజిల్ ధరలపై మహిళలు తిరుగుబావుటా ఎగుర వేశారు.కేంద్రప్రభుత్వం విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నారీ లోకం పెద్ద ఎత్తున స్పందించింది.ప్రధాని మోడీ డౌన్ డౌన్ …కేంద్రప్రభుత్వ విధానాలు నశించాలి…పెరిగిన గ్యాస్,డీజిల్ ధరలు తగ్గించాలి అంటూ గురువారం సూర్యాపేట పట్టణ కేంద్రంలో మహిళా లోకం చేస్తున్న నినాదాలతో సూర్యపేట పట్టణం మారుమ్రోగింది.
పెరిగిన గ్యాస్,డీజిల్ ధరల కు నిరసన తెలుపాలంటూ గులాబీ చీఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు బానుపురి లో భారీ స్పందన లభించింది.సూర్యపేట జిల్లా కేంద్రంలోని స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి మొదలైన మహిళల నిరసన ప్రదర్శన శంకర్ విలాస్,యం జి రోడ్,తెలంగాణా తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ కు చేరుకుంది.భారీ ఎత్తున తరలి వచ్చిన నారీ లోకం ప్రధాని మోడీ పై తిరుగుబావుటా కు సిద్ధం అంటూ నినాదాలు చేయడంతో పాటు పెంచిన గ్యాస్,డీజిల్ ధరల కు నిరసనగా కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల లలితా ఆనంద్,చివ్వేంల ఎంపీపీ కుమారి, పెన్ పహాడ్ జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, ఆత్మకూర్ ఎంపిపి మర్ల స్వర్లలత , పట్టణ టి. ఆర్.ఎస్ ఉపాధ్యక్షులు కరుణశ్రీ, కో అప్షన్ సల్మా, విజయ ,రచూరి రమణ, అంజమ్మ, కౌన్సిలర్లు లక్ష్మీ కాంతమ్మ, నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్, గుండూరి పావని, సౌమ్య జానీ, మాజీ కౌన్సిలర్లు గాజుల రాంబయమ్మ, మాణిక్య మ్మ , జ్యోతి కరుణాకర్, మహేశ్వరి,వివిధ గ్రామాల మహిళా సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.