ప్రజల రక్తాన్ని పీల్చుకుతింటున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
- ధరలు పెంచుతూ డ్రామాలు
- తక్కళ్ళపెల్లి రవీందర్ రావు
నర్సంపేట మార్చి24(నిజం న్యూస్):
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతూ పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుతింటుతున్నారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంత్తన లేకుండ టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు పోటీలు పడుతూ గ్యాస్ బండ పెట్రోల్ డీజిల్ కరెంట్ రవాణా చార్జీలు పెంచారని కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ మాజీ ఎంపీపీ తక్కళ్ళపెల్లి రవీందర్ రావు అన్నారు నర్సంపేట పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిపాలిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు టిఆర్ఎస్ బీజేపీ పాలకులు ధాన్యం పేరుతో ఇబ్బందులు పెట్టుకుంటూ దొంగాట ఆడుతున్నారని పెంచుతున్న ధరలను ప్రజలు పట్టించుకోవదని నాటకాలకు తెరలేపారు ఓట్లు ఉంటే ఓతీరు ఓట్లు లేకపోతే మరోతీరు ఇదేందని రవీందర్ రావు మండిపడ్డారు కోవిడ్ మూలంగా ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నం కాగా ఆర్థికంగా ఆదుకోవాల్సిందిపోయి ప్రజలను నిత్యఅవసరాలు అయిన కరెంట్ రవాణా గ్యాస్ బండ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ఈకార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెండెం రామానంద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ప్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్ బత్తిని రాజేందర్ ములుకల వినోదసాంబయ్య తదితరులు పాల్గొన్నారు.