మిర్యాలగూడ బైపాస్ లో వెల్డర్ రామకృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య.

మిర్యాలగూడ మార్చి 24.(నిజం న్యూస్): మిర్యాలగూడ బైపాస్ లోని రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా మారుతిరావుగారికి సంబందించిన రేకులషెడ్డులో వెల్డింగ్ వర్కర్ పల్లా రామకృష్ణ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.కొన్నేళ్ళ క్రితం ఆంద్రా ప్రాంతం నుండి వచ్చిన కృష్ణ,మిర్యాలగూడ పట్టణంలో వర్క్ షాప్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు అతని బావ గొళ్ళగాని రాజు తెలిపారు.కాల్వపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్ళి అయినట్లు,ఇద్దరు పిల్లలు ఉన్నారని,గత 7 సంవత్సరాల క్రిత బార్యతో విడాకులు అయినట్లు తెలిపారు.అప్పటి నుండి తన తల్లితో కలిసి ఉంటున్న రామకృష్ణ, సంవత్సరం క్రితం అతని తల్లి కూడా కరోనాతో మరణించింది.అప్పటినుండి నుండి ఒంటరిగా ఉంటున్న రామకృష్ణ ,ఈ రోజు ఉరివేసుకోవడం జరిగింది.ఇతను గతంలో మర్డర్ కేసులో ఉన్నట్లు సమాచారం.వివారులు సేకరిస్తున్న మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు.గతంలో కూడా ఇదే రేకులషెడ్డులోని రూమ్ లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.