Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వివాదాలకు అడ్డాగా ముకుందపురం ప్రభుత్వ పాఠశాల.?

వివాదాలకు అడ్డాగా మారిన ముకుందపురం ప్రభుత్వ పాఠశాల??

పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయు రాలు, ప్రధానోపాధ్యాయుని మధ్య విభేదాలు ఎందుకు?

ఇరువురి గొడవలు, డి ఈ ఓ . స్థాయికి చేరుకున్న వైనం.

వ్యాయామ ఉపాధ్యాయురాలి సునీత పై వేటు.

పాఠశాల ఇరువురి బాగోతం, ఒకరిపై, మరొకరు మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

అయోమయంలో పాఠశాల, విద్యార్థులు ఉపాధ్యాయులు.

సూర్యాపేట మార్చి 24 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని దృఢ సంకల్పంతో, మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా, లక్షల రూపాయలు నిధులతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నాణ్యమైన బోధన సకల సౌకర్యాలు కల్పిస్తున్న తరుణంలో, లక్షల రూపాయల జీతాలు తీసుకొని, ఒకరిపై, మరొకరు వివాదాస్పదమైన మాటలు మాట్లాడి, ఒక ప్రక్క ఉపాధ్యాయ బృందం, మరొక ప్రక్క విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్న సంఘటన, ఆలస్యంగా మునగాల మండల పరిధిలోని, ముకుందాపురం పాఠశాలలో వివాదాలు భగ్గుమన్నాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు.. ముకుందాపురం పాఠశాలలో గత కొద్ది రోజులుగా వ్యాయామ ఉపాధ్యాయులు సునీత మొదట దుర్భాషలాడిన ట్లు సదరు ప్రధానోపాధ్యాయులు రామారావు, సూర్యాపేట డీఈవో కు ఫిర్యాదు చేశారు. దీనితో సంబంధిత మండల విద్యాధికారి తో విచారణ చేయించారు.

దీనితో అధికారి పాఠశాల విచారణ జరిపి తుది రిపోర్టును డి ఈ ఓ. కు అందజేశారు. దీనితో ఆమెకు సస్పెన్షన్ ఆర్డర్ రావడం జరిగినట్లు సమాచారం. దీనితో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన సదర్ వ్యాయామ ఉపాధ్యాయురాలు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ప్రధానోపాధ్యాయుని పై ఫిర్యాదు చేశారు. అనంతరం తిరిగి ప్రధానోపాధ్యాయుడు, ఆమెపై ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనతో, పాఠశాల దిగజారుడుతనం బయటపడిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఏ సమయంలో పాఠశాల ఏం జరుగుతుందని , పాఠశాల విద్యార్థులు , ఉపాధ్యాయ బృందం ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా జరిగిన సంఘటన పట్ల, పూర్తిస్థాయిలో విచారణ జరిపి, పాఠశాల విద్యార్థుల అభివృద్ధి తోడ్పాటు గా, ఉపాధ్యాయుల వివాదాలను రూపుమాపు టకు, జిల్లా యంత్రాంగం నడుం బిగించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పార్టీ నాయకులు, కోరుతున్నారు.