ఏపీ EAPCET 2022 షెడ్యూల్‌ను ప్రకటన
AP EAPCET 2022 షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం విడుదల చేశారు. ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ విభాగాల్లో జూలై 4 నుంచి 8 వరకు ఐదు రోజుల పాటు, అగ్రికల్చర్ విభాగంలో ఈఏపీసెట్ పరీక్షలు జూలై 11, 12 తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టులో ఫలితాలు విడుదల చేసి సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ చేస్తామని మంత్రి తెలిపారు.
పరీక్షల నిర్వహణకు గతంలో 136 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈసారి అవసరమైతే కేంద్రాల సంఖ్యను పెంచుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నామని, కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని అభిప్రాయపడ్డారు. ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.