రికార్డుల తనికీలో కెమెరా, వీడియో వినియోగించవచ్చు
– దారిద్ర్యరేఖకు దిగువను ఉన్నవారు
రికార్డున తనిఖీని ఉచితం…..
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 23 (నిజం న్యూస్)
సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం జరుగు రికార్డుల పరిశీలన
సందర్భంగా దరఖాస్తుదారుడు కెమేరాలు, వీడియో ఫిల్ములు వినియోగించి
రికార్డులను కాపీ చేసుకోవచ్చు. అయితే సమాచారం సమాచార హక్కు చట్టం
పరిధిలో అనుమతించదగినదై ఉండాలి. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ
సంజయ్ సింగ్ వెర్సస్ ఢిల్లీ పి.డబ్ల్యు.డి. అప్పీలు (సంఖ్య సిఐసి/డబ్ల్యుబి/ఎ2006/
00144 తేది 20-3-2006) లో కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్ వజహత్
హబీబుల్లా తీర్పు ఇచ్చారు. అదే విధంగా దారిద్ర్యరేఖకు దిగువను ఉన్నవారు
రికార్డున తనిఖీని ఉచితంగా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర సమాచార కమిషన్ ఒక అప్పీలు (సంఖ్య 2028/ఐసీ-డిర్/2008, తేది
4-8-2008) లో తీర్పు ఇచ్చింది.
దరఖాస్తుదారులను, ఉద్యమకారులను వేధిస్తే కఠిన చర్యలు
సమాచార హక్కు చట్టంను అనుసరించి సమాచారం కోసం దరఖాస్తు
| చేసుకున్న వారిని, ఈ చట్టం ఉద్యమకారులను ఎవరైనా వేధించినా, వారిపై
| దౌర్జన్యాలకు పాల్పడినా నిందితులపై కఠిన చర్యలు తీసుకొనాలని రాష్ట్ర ప్రభుత్వం
ఆదేశించింది. ఆ మేరకు ఉత్తర్వులు (మోమో నెంబర్ 33086/ఆర్టిఐఎ/
జిపిఎం&ఎఆర్/2010, తేది 30-9-2010) వెలువడ్డాయి. జిల్లా కలెక్టర్లు,
పోలీసు ఉన్నతధికారులు ఇలాంటి సంఘటనలు జరిగితే వాటి పై ప్రత్యేక దృష్టి
| కేంద్రీకరించి బాధితులను ఆదుకోవాలని, నేరస్తులపై క్రిమినల్ కేసులు నమోదు
చేసి కఠినంగా శిక్షలు పడేలా చూడాలని కోరింది. సమాచార హక్కు
దరఖాస్తుదారుల వలన, ఉద్యమకారుల వలన తమ అవినీతి బండారం
బయటపడుతుందని కొందరు ఉద్యోగులు, అధికారులు వేధింపులకు,
దౌర్జన్యాలకు దిగుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇలాంటి
అకృత్యాలను నిరోధించడానికి
జిల్లా కలెక్టర్,
జిల్లా పోలీసు ఉన్నతాధికారులు
ప్రతి నెలా పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కాగా ఈ విషయానికి విస్త్రత ప్రచారం కూడా కల్పించి వేధింపులను చెక్
పెట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.