మిశ్రమ వ్యవసాయం విధానంలో రాణిస్తున్న లింగాల రైతు శ్రీధర్

మంత్రి జగదీశ్ రెడ్డి సలహా తో కూరగాయల సాగు లో అద్భుతాలు సాధిస్తున్న, యువరైతు శ్రీధర్! .

రైతు వేదిక ప్రారంభం సందర్భంగా నూతన వ్యవసాయ పద్ధతుల పై శ్రీధర్ కు అవగాహన కల్పించిన మంత్రి వర్యులు. . .

మంత్రి మాటలే స్ఫూర్తిగా సంప్రదాయ వరి ని వదిలి మిశ్రమ కూరగాయలు, చేపల పెంపకం లొ రాణిస్తున్న యువకుడు. .

రైతుల అభ్యున్నతి లో రాణిస్తున్న, యువ రైతు శ్రీధర్ ను సన్మానించిన కే.వి.కే శాస్త్రవేత్తలు.

సూర్యాపేట ,మార్చి 23, నిజం న్యూస్.

పెన్పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన శ్రీధర్, సంప్రదాయ సాగు కు స్వస్తి పలికి, నూతన వ్యవసాయ విధానాలపై యువత దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, చెప్పిన సలహా లు. సూచనలు ఆ యువకుడి లొ స్ఫూర్తి ని రగిలించాయి. దీనితో యువకుడి ఆసక్తి నీ గమనించిన మంత్రి. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, రైతుల అభ్యున్నతి లో భాగంగా,. మిశ్రమ కూరగాయల సాగు విధానం, చేపల పెంపకం పై యువకుడికి సలహాలు ,సూచనలు స్వయంగా చేశారు.

సరిగ్గా ఐదు నెలల క్రితం దూపహడ్ రైతు వేదిక ప్రారంభ సందర్భంగా లింగాల కు చెందిన యువ రైతు శ్రీధర్ గౌడ్ తో జరిగిన మంత్రి కలయిక రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ వ్యవసాయ రంగం లొ అతనికి పేరొచ్చెలా చేశాయి… సరి కొత్త వ్యవసాయ విధానాన్ని తాను చేయడం తో పాటు మరికొంత మంది చేయడానికి తోడ్పాటు నందిస్తున్న శ్రీధర్ సేవలను గడ్డిపల్లి అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించి సన్మానించారు…

.. కూరగాయ పంటలైన సొర, బీర, వంగ, టమాటా లతో పాటు చేపల పెంపకం ద్వారా ఎకరానికి లక్ష రూపాయలు ఆర్జిస్తున్నాడు శ్రీదర్….. గ్రామం లొ మరింత మందికి అవగాహన కల్పిస్తున్న శ్రీధర్ ను మరింతగా ప్రోత్సాహం ఇవ్వడానికి మార్కెట్ డైరెక్టర్ దాచేపల్లి భరత్ ఆధ్వర్యంలో గ్రామస్తులు శ్రీధర్ ను సన్మానించారు.

మంత్రి గారి సూచనలే… నాకు గుర్తింపు తెచ్చాయి.. శ్రీదర్.

దూపహడ్ రైతు వేదిక ప్రారంభం సందర్భంగా అక్కడికి వెళ్ళాను.. నూతన వ్యవసాయ పద్ధతులపై మంత్రి మాట్లాడిన తీరు .. ఆయనకున్న అవగాహన నన్ను విపరీతంగా ఆకట్టుకుంది… నా ఆసక్తి ని గమనించిన మంత్రి నన్ను దగ్గరకు పిలిచి వివరాలు అడిగారు.. అయితే ఇప్పటి వరకు సాంప్రదాయ వరి సాగు చేసి నష్టాల పాలైన నాకు.. మిశ్రమ కూరగాయల సాగు , చేపల పెంపకం పై మంత్రి నాకు స్వయంగా అవగాహన కల్పించారు.

అంతే కాకుండా ఈ పద్దతి లొ సాగు చేస్తూ ఎకరానికి నెలకు లక్ష ఆర్జిస్తున్న వారి అనుభవాలను తెలియజెప్పారు.. ప్రజాసేవలో బిజీగా ఉండే మంత్రి గారికి వ్యవసాయం పై ఉన్నా అవగాహన చూసి ఆశ్చర్యపోయిన.. ఆ రోజున మంత్రి గారి ఇచ్చిన సలహా లే నాకు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు కు కారణం. మంత్రి జగదీశ్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకుని నా లాంటి యువ రైతులకుమిశ్రమ వ్యవసాయ విధానం పై అవగాహన కల్పిస్తా.. నా గుర్తింపు కు కారణం అయిన మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైనా రైతుబిడ్డ, జయహో… జగదీష్ అన్న కు సెల్యూట్..