ఆడపిల్ల వద్దనుకుంటే మాకు అప్పగించండి సిడిపిఓ శిరీష.

మరిపెడ మార్చి 22 ( నిజం న్యూస్) నాలుగవ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడం తో పోషించలేక పసికందును శిశు గృహ కు అప్పగించిన ఘటన మరిపెడ మండలంలో చోటుచేసుకుంది. రెడ్యా నాయక్ తండా లో ఓ గిరిజన కుటుంబం నాలుగవ కాన్పులో పుట్టిన ఆడపిల్ల వద్దని చైల్డ్ లైన్ కి ఫోన్ చేయగా మరిపెడ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు సిడిపిఓ శిరీష వారి ఇంటికి వెళ్లి శిశువు ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం పాపను వరంగల్ లోని శిశు గృహ కు తరలించారు.