1.5 కిలోమీటర్లు అనాధ శవాన్ని మోసుకొచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు

మానవత్వం చాటుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు
– 1.5 కిలోమీటర్లు అనాధ శవాన్ని మోసుకొచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా హెచ్ఎం పాడు మార్చి 22 (నిజం న్యూస్ ):
దట్టమైన అటవీ ప్రాంతం నుండి అనాధ శవాన్ని 1.5 కిలోమీటర్ల దూరం తమ భుజాలపై బయటకు తీసుకువచ్చి మానవత్వం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా, హెచ్ఎం పాడు మండలం పరిధిలోని హాజీపురం ఫారెస్ట్ ఏరియాలో 1.5 కిలోమీటర్ల దూరంలో నీ దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 62-65 మధ్య వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తీ చనిపోయి ఉన్నట్లు గమనించిన గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే హెచ్ఎం పాడు ఎస్సై కి తెలియజేశారు. సమాచారం అందుకున్న కనిగిరి సిఐ పాపారావు , హెచ్ఎం పాడు ఎస్సై కృష్ణ పావని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి అతని తాలూకు బంధువులు ఎవరైనా ఉన్నారని వెరిఫై చేసినారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీస్ వారు ఆ మృతదేహాన్ని హాజీపురం ఫారెస్ట్ ఏరియా నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం తమ భుజాలపై మోసుకుంటూ కనిగిరి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తీసుకురావడం జరిగింది. అనంతరం అంత్యక్రియలు కూడా నిర్వహించటం జరిగింది. విధుల్లో మానవత్వం చాటుకున్న కనిగిరి సిఐ పాపారావు, హెచ్ఎం పాడు ఎస్సై కృష్ణ పావని, కానిస్టేబుల్ బ్రహ్మయ్య, ప్రవీణ్ కుమార్ స్థానిక ప్రజలు కొనియాడారు.