గ్యాస్ సిలెండర్ పేలి చిన్నారి దుర్మరణం

నిజామాబాద్ మార్చి 22, నిజం న్యూస్) :
నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్లో ఓ ఇంట్లో సిలిండర్ పేలి చిన్నారి దుర్మరణం చెందింది. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి తరువాత జరిగిన ఈ ఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగర శివారులోని సారంగపూర్ డైరీ ఫాం వద్ద రాజస్థాన్కు చెందిన సునీల్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో సునీల్ ముగ్గురు పిల్లలు బబ్లూ(9), జగ్గు(4), నమ్కి(5) అనే పాప గాయపడ్డారు. వారిని రాత్రి స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అందరి కన్న చిన్నపాప జగ్గు మృతి చెందింది.
తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లలను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సంఘటన స్థలాన్ని 6వ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.