ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి….

డోర్నకల్ మార్చి 22 (నిజం న్యూస్)మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన న మిర్చి కౌలురైతు నారపల్లి సంపత్ మహబూబాబాద్ రూరల్ మండలానికి చెందిన దేవి రెడ్డి వెంకట్ రెడ్డి లక్మా తండాకు చెందిన అజ్మీర శ్రీను శనగ పురం గ్రామానికి చెందిన గిరిజన రైతు బొడ హరి అతని భార్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాలను మహబూబాబాద్ జిల్లా రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుణ గంటి రాజన్న శెట్టి వెంకన్న లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుద్దెల రామ్మూర్తి పరామర్శించారు.
అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం చేసి తీవ్ర అప్పులపాలై అప్పులు తీర్చలేక మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబాలకు తక్షణమే 20 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించాలని వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని వారి కుటుంబాలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.