”లేత చేగురులు” తెలంగాణ బడి పిల్లల హరిత కథలు కవితా సంపుటిని ఆవిష్కరిoచిన జిల్లా కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 21(నిజం న్యూస్)
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలని, భాషతో పాటు కవితా సృజన పట్ల ఆసక్తిని కలిగించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రముఖ రచయిత్రి, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ బండారు జయశ్రీ సంపాదకత్వంలో వెలువడిన ”లేత చేగురులు” తెలంగాణ బడి పిల్లల హరిత కథలు కవితా సంపుటిని జిల్లా కలెక్టర్ ఆవిష్కరిoచి విద్యార్థులను అభినందించారు.ఉపాధ్యాయులు బోధనతో పాటు బాషా సాహిత్యం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మెలుకువలు నేర్పాలన్నారు. వాళ్లలో చిగురించే భావాలను కవితలుగా మలచడానికి మార్గదర్శనమ్ చేయాలన్నారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలకు చెందిన పాఠశాలల చిన్నారులు రాసిన కవితలు ఈ సంకలంలో ఉండటం అభినందనీయమని సంపాదకులు బండారు జయశ్రీని ప్రత్యేకంగా అభినదించారు.ఇదే కార్యక్రమంలో యాదాద్రికి చెందిన కవి రచయిత శ్రీ పాద శివ ప్రసాద్ రాసిన యాదాద్రి వైభవం సిడి ని కలెక్టర్ ఆవిష్కరించారు. కవితలు రాసిన విద్యార్థులకు
ప్రశంసపత్రాలను కలెక్టర్ అందజేశారు.కార్యక్రమంలో శ్రీ ఫౌండేషన్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ రావు,జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పోరెడ్డి రంగయ్య,జిల్లా అటవీ అధికారి శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి , జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, బాలల హక్కుల పరిరక్షణ అధికారి సైదులు, కవులు. కవయిత్రులు మర్రి జయశ్రీ,వల్లల విజయ, లక్ష్మి,సరితచకిలం సురేందర్ రావు,విద్యార్థినిలు పాల్గొన్నారు.