కేంద్ర మంత్రి తో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ
నిజామాబాద్ బ్యూరో ,మార్చి21 (నిజం న్యూస్):
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం సహచర ఎంపీలు బండిసంజయ్ సోయం బాబురావు తో కలిసి పార్లమెంటులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు గత ఏడాది అకాల వర్షాలు కురవడం వల్ల పసుపు పంటలు దిగుబడి నష్టాన్ని ఆయనకు వివరించారు రైతులకు పరిహారం అందించాలి అని చర్చించారు అలాగే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని తద్వారా తెలంగాణ రాష్ట్ర రైతుల నష్టపోతున్నారని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ కు ఎంపీలు వివరించారు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు