హీరో షోరూం పేరుతో ఘరానా మోసం??

షార్పు మోటార్స్ పేరుతో షోరూం పెట్టి, వాహనదారులు నెత్తిమీద , శఠగోపం పెట్టిన వైనం .
తుంగతుర్తి మార్చి 21(నిజం న్యూస్):
ఆరుగాలం రైతులు కష్టపడి పంటలు పండించి , ఖర్చులు పోను కొంత లాభం వస్తే , ఆ డబ్బులతో రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద వెళ్లడానికి సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల ఉండటంతో, తుంగతుర్తి మండల కేంద్రంలో నూతనంగా వెలిసిన హీరో షోరూం వారి ఆధ్వర్యంలో షార్క్ మోటార్స్ పేరుతో షోరూం తుంగతుర్తి లో కొనసాగించారు. దీంతో రైతులు కొంతమంది షో రూమ్ లో కొనుగోలు చేశారు.
ఆరు నెలలు గడుస్తున్నా నేటి కొంతమందికి వాహన పత్రాలు అందజేయగా పోవడంతో, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వీరి దీనస్థితి చేరుకొన్నది తుంగతుర్తి లో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రోడ్డుపైన పోలీసులు ఉండడంతో వీరి కష్టాలు వర్ణనాతీతం దీనితో పట్టణ కేంద్రానికి చెందిన బోయిని లింగయ్య టీవీఎస్ ఎక్సెల్ 70 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేశాడు నేటికీ పత్రాలు ఇవ్వలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కాకపోవడంతో , ఇబ్బందులు పడుతున్నారు ఇదేవిధంగా మున్న సత్యమ్మ తమ కుమారుడి కోసం 84 వేల రూపాయలు పెట్టి హీరో బైక్ ఉన్నది దీనికి కూడా నేటి వరకు పత్రాలు ఇవ్వలేదు ఫోన్ చేస్తే సంబంధిత యాజమాన్యం ఫోన్ ఎత్తడం లేదని వాపోతున్నారు.
ఇదిలా ఉండగా ఈ విధంగా ఎంతో మంది జీవితాలతో చెలగాటమాడుతున్న హీరో షోరూం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి వద్దా??అని ప్రశ్నిస్తున్నారు. గడిచిన మూడు నెలల క్రితమే షోరూం ఎత్తివేసి, వేరే చోట పెట్టడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.. ఇదిలా ఉంటే బోయిన లింగయ్య 70 వేల నగదును పెట్టు టీవీఎస్ ఎక్సెల్ పొందె, ప్రస్తుతం అతని పేరు మీద లోన్ ఉందని చెప్పడం విడ్డూరంగా ఉంది. జరిగిన సంఘటనపై సూర్యాపేట ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాహనదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని బాధిత వాహనదారులు కోరుతున్నారు…