కొనసాగుతున్న శాసనసభ సమావేశం.

హైదరాబాద్ బ్యూరో మార్చి 21( నిజం న్యూస్) భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లపై చర్చ జరుగుతోంది. రబీలో పండిన ధాన్యాన్ని కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెరాస నిర్ణయించింది. మోదీ సర్కార్‌పై పోరుకు కేసీఆర్ కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ధర్నాలు, నిరసనలకు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో రూపకల్పన జరగుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.