Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాలికలపై పర్యవేక్షణ పటిష్ఠం చేస్తాం..

జిల్లా కమిటీ తో పూర్తి విచారణ జరిపిస్తాం..
జాతీయ మైనారిటీ సెల్ సభ్యులు శాహెజాది

ఆలేరు మార్చి21( నిజం న్యూస్):

జాతీయ మైనారిటీ సెల్ సభ్యులు సయ్యద్ శాహెజాది ఆదివారం కలం రేపిన ఉత్తరంకు ఆలేరు మైనారిటీ గురుకుల పాఠశాల ను సోమవారం విచారణ జరుపుతున్నారు. వాస్తవాలు తెలుసుకోవడం కొరకు మైనారిటీ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల ని వివరాలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఎస్ఐ , పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తో కలిసి మాట్లాడటం జరిగింది. జిల్లా కమిటీ వేసి పూర్తి విచారణ చేయాల్సి ఉంది. అనిఫ్ పై వచ్చిన ఆరోపణ రాసిన లెటర్ రాతపూర్వకంగా రాయించడంతో ఆరోపణ లెటర్ కు మ్యాచ్ కావడం లేదు. త్వరలోనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్.పి. , సోషల్ కమిటీ, తల్లిదండ్రులతో కలిసి కమిటీ వేసి విచారణ జరిపిస్తాం.

ఇలాంటి సంఘటనలు జరిగితే విద్యార్థులకు చదువులు దూరం అవుతాయి. పాఠశాల గోడలు చిన్నవిగా ఉన్నాయి. సిసి ఫొటేజులు పరిశీలన చేయిస్తాం. ఎస్.ఐ గారి రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి పరిశీలన తెలుస్తుంది. పాఠశాల ఆవరణలో మాట్లాడిన తరువాత పూర్తి విషయాలు ఇంకా తెలియలేదు. విచారణ లో తేలిన వారిని చట్టపరమైన చర్యలు కఠినమైన శిక్ష అనుభవిస్తారు. బాలికల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. బాలికలు ఇప్పుడిప్పుడే చదువు పై శ్రద్ధ వహిస్తున్నారు. జిల్లా మైనారిటీ అధికారి సత్యనారాయణ ‌మాట్లాడుతూ ఆరోపణలు వచ్చిన వారి వివరాలు కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది. మొదటగా బాదితునిపై విచారణ జరిపిస్తాం.

ప్రతి ఒక్కరి వ్రాత పూర్వకాలు తీసుకుని పరిశీలిస్తున్నాం. తప్పకుండా బాలికలకు న్యాయం చేస్తాం. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాం. జిల్లా వ్యాప్తంగా గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల పై పర్యవేక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతూ ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బట్డుపల్లి అనురాధ, ఏబివిపి జిల్లా కన్వీనర్ మనికంట, ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వనం రాజులు జాతియ మైనారిటీ సెల్ సభ్యులు సయ్యద్ శాహెజాదికి వినతిపత్రం అందజేసినారు.