హాలియా వద్ద సాగర్ కాలువలో దూకిన ప్రేమజంట…

హైదరాబాద్ బ్యూరో మార్చి 21 నిజం న్యూస్ )
నల్గొండ జిల్లా హాలియా వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. సాగర్ కాలువలోకి దూకి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కాల్వలో దూకిన యువతీ యువకులను కాపాడేందుకు తాడును తీసుకువచ్చారు. తాడు సాయంతో యువతిని కాపాడారు. యువకుణ్ని కాపాడేలోగా.. అతను నీటిప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుడి కోసం ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ ప్రేమజంట పీఏపల్లి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.