కరెంట్ షాక్ తో మనిషి, ఎద్దు మృతి

ములుగు, మార్చి 20 నిజం న్యూస్ : మండలంలోని అబ్బాపురం గ్రామానికి చెందిన యాదవ కులానికి చెందిన సాయి బోయిన యుగేందర్ కొమ్మాల లక్ష్మి నరసింహ స్వామీ తీర్థం కుటుంబ సమేతంగా తనకున్న ఎడ్ల బండిలో వెళ్లి మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి 163 ములుగు – వరంగల్ హై వే పై సమీపంలో ఉన్న జాకారం – పందికుంట గ్రామాల శివారు వద్ద కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఎద్దు మరియు రైతు అయిన యుగెందర్ అక్కడికక్కడే మృతి చెందడం పట్ల మృతుడి భార్య, పిల్లలు,బంధువులు, అబ్బాపురం, జాకారం, పందికుంట గ్రామస్థులు బోరున విలపించారు.మృతుడు మరియు ఎద్దు విద్యుత్ అధికారుల నిర్లక్షం వల్ల రెండు జీవులు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు పోలీసులు,రెవెన్యూ అధికారులు, దర్యాప్తు చేస్తున్నరు.మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని అబ్బాపురం గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.