Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మైనార్టీ స్కూల్ విద్యార్థినిలతో వ్యభిచారం..?

కలకలం సృష్టిస్తోన్న విద్యార్ధిని లేఖ..

ఆలేరు మార్చి 20 ( నిజం న్యూస్):
కలకలం సృష్టిస్తోన్న యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ విద్యార్థిని రాసిన ఓ లేఖ ఆలేరు లో సంచలనం సృష్టిస్తోంది. పాఠశాలలోని అమ్మాయిలతో సిబ్బంది రోజూ వ్యభిచారం చేయిస్తున్నారని, తమని నగ్నంగా మార్చుతున్నారని, వెంటనే మమ్ముల్ని కాపాడాలని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, పోలీసులతోపాటు మీడియాను వేడుకుంది. తన పేరు కూడా బయటకు రాకుండా చూడాలని అభ్యర్థించింది. ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుకుంటున్న అమ్మాయిలతో పాఠశాల సిబ్బంది అయిన గౌస్, సాజీయా, అర్షియ, రమాదేవి, రిజ్వానా, నభిహ, అజుం కలిసి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారని తెలిపింది. గౌస్, సాజీయా స్కూల్‌లోనే నగ్నంగా పడుకుంటారని, గౌస్ అమ్మాయాలను టచ్ చేయడంతోపాటు బట్టలు విప్పి చూయించాలని, తనతో పడుకోవాలని కోరుతున్నారని వివరించింది. అలాగే రాత్రి సమయంలో స్కూల్ పక్కన్నే తీసుకున్న రూమ్‌కు తీసుకెళ్లి వేరే వ్యక్తుల వద్ద పడుకోబెడుతున్నారని వాపోయింది. తమకు రక్తం కారుతుందని, నొప్పి లేస్తుందని వెళ్లకుండ ఉంటే అన్నం పెట్టడం లేదని, అందరూ కలిసి కొడుతున్నారని తెలిపింది. అలాగే అమ్మాయిల వద్దకు వచ్చిన వారి నుంచి ఒక్కొక్కరికి రూ.20 తీసుకుని అందరూ కలిసి పంచుకుంటున్నారని, పడుకున్న అమ్మాయికి రూ.500 ఇస్తున్నారని ఆ లేఖలో వివరించింది. ఈ వారం తన వంతు వస్తుందని, అక్కడికి పోవడానికి భయం వేస్తుందని వాపోయింది. విషయం స్కూల్ ప్రిన్సిపల్‌కు చెప్పినా, బయటి వాళ్లకు తెలిసినా టీసీ ఇచ్చి పంపించడంతోపాటు చంపేస్తామని గౌస్ అంకుల్, సాజీయా ఆంటీ బెదిరిస్తున్నారని తెలిపింది. మాకు ఇక్కడ భయం వేస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని ఆ విద్యార్థిని లేఖలో పేర్కొంది. తన పేరు బయటికి వస్తే చంపేస్తారని భయాందోళనను వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా లేఖను ఆ స్కూల్‌కు సంబంధించిన విద్యార్థిని రాసిందా లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా రాశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. లేఖ మొత్తం బ్లాక్ ఇంక్‌తో ఉండగా పైన ”జై శ్రీరామ్” అని బ్లూ ఇంక్ తో ఉండటం పలు అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అమ్మాయిలను కాపాడాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లను కోరింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు ఎస్ఐ ఇద్రిస్ అలీ తెలిపారు.