ఎవడైతె నాకేంటి.. ఇది నా అడ్డా..!

– వార్త కధనాలు రాస్తే నాకు ఏమైనా భయమా అంటున్న మున్సిపాలిటీ అవుట్ సోర్స్ ఉద్ద్యోగి…?
– ఎన్ని వార్త కధనాలు రాసిన నేను ఏం..చేయాలో తెలుసంటున్న వైనం…
– నామీద ఇంక్వెరీ చేస్తే ఆ..అధికారుల పేర్లు చెప్పేస్తా…
– ఆఅధికారులు ఎవరనేది మున్సిపాలిటీలో చర్చ…?

మణుగూరు మార్చి 19 (నిజం న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల మున్సిపాలిటీ కార్యాలయంలో అవుట్ సోర్స్ ఉద్ద్యోగిగా పని చేసే ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నడనే ఆరోపణల వార్త కధనాలు వస్తున్న జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నారని మున్సిపాలిటీ ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ చేసిన అవినీతిపై పత్రిక విలేకరులు పత్రికలలో వార్తలు కధనాలు ప్రచురిస్తుంటే నాకు ఏమైనా భయమా..ఇలాంటివి చాలా చూసాలే అని అంటున్నాడని స్వయానా తోటి ఉద్ద్యోగులే అంటున్నారనేది అతిశయోక్తి కాదు.పత్రిక విలేకరులు ఎన్ని వార్త కధనాలు రాసుకున్న నేను ఏమి చేయాలో నాకు తెలుసులే అనే విధంగా వ్యవహరిస్తున్నడని తోటి ఉద్ద్యోగులు చెప్పుకొస్తున్నారు.అవుట్ సోర్స్ ఉద్ద్యోగి ఈవిధమైన ధీమాగా ఉన్నడంటే ఈఉద్ద్యోగి వెనుక ఏ..అధికారులు ఉన్నారనేది మున్సిపాలిటీలో పలు రకాల అనుమానం వ్యక్తమౌతోంది.అవుట్ సోర్స్ ఉద్ద్యోగమే చేస్తున్న..అయితే ఏంటి..పత్రిక కధనాలు నన్ను ఏమి చేయవని అంటున్నడనే ఆరోపణలే జోరుగా వినిపిస్తున్నాయి.ఒక వేళ జిల్లా అధికారులు నామీద ఇంక్వెరీ చేసి చర్యలు తీసుకుంటే నా వెనుక ఉన్న అధికారుల పేర్లు,రాజకీయ నాయకుల పేర్లు చెప్పుతున్నడనే ఆరోపణలు కూడా మున్సిపాలిటీ వ్యాప్తంగా జోరుగా వినిపిస్తోంది.

దీన్ని బట్టి చూస్తే ఈఅవుట్ సోర్స్ ఉద్ద్యోగిపై జిల్లా అధికారులు,సీ.డీ.ఎమ్.ఏ అధికారులు ఇంక్వెరీ పెట్టి చర్యలు తీసుకుంటే ఇతని వెనుక ఉన్న అసలు ఆఅధికారులు,రాజకీయ నాయకులు ఎవరో బయటకు వస్తారని మున్సిపాలిటీ ప్రజలు అనకొస్తున్నారు.ప్రతి రోజు నిత్యం మద్యం పుచ్చుకొని కార్యాలయానికి వచ్చి నెల జీతం కోసం ఎలక్ట్రికల్ తంబ్ వేసి రిజిస్టర్ లో మస్టర్ వేయించుకోని వెల్లుతున్నడనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.మున్సిపాలిటీలో ఇంత జరుగుతున్న మున్సిపాలిటీ కమిషనర్,ఏఈ అధికారి ఎందుకు మౌనంగా ఉన్నరనేది ప్రశ్నార్థకంగా మారింది.ఈఅవుట్ సోర్స్ ఉద్ద్యోగి ఎంత ముడుపులు పుచ్చుకున్న దానిలో కొంతవాటా ఏఈ అధికారి పోతుందనే ఆరోపణలు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి.నిజానికి ఈఇద్దరి వెనుక స్థానిక అధికారపార్టీ ఓ..కీలక నాయకుడు,జిల్లా అధికారులు ఉండి నడిపిస్తున్నరని మున్సిపాలిటీ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీలో నేనే చక్రం తిప్పుతున్న..పత్రిక విలేకరులు ఏం..చేస్తారో చేసుకోమనే మాటలు అవుట్ సోర్స్ ఉద్ద్యోగి నోటి వెంట నుండి వినపడుతున్నాదని తోటి ఉద్ద్యోగస్థులు చెప్పుకొస్తున్నారు.మున్సిపాలిటీలో కేవలం ఓ అవుట్ సోర్స్ ఉద్ద్యోగి ఇంత దందా చేస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నరనేదే అంతుచిక్కని ప్రశ్నగా మారింది.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ఈఅవుట్ సోర్స్ ఉద్ద్యోగిపై చర్యలు చేపట్టుతే నిజనిజాలేంటో బయటకు వస్తాయని మున్సిపాలిటీ ప్రజలు,పలువురు సంఘాల నాయకులు కోరుతున్నారు.