హోలీ, మత్తులో పాఠశాల ధ్వంసం

పాఠశాలల్లో పేకాట,మద్యం విందులు.
తాగిన మత్తులోతలుపులు కిటికీలు బెంచీలు ధ్వంసం.
తరగతి గదుల లో మద్యం కాళీ సీసాలు.
పోలీస్ లకుపిర్యాదుచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు.
ఆత్మకూరు ఎస్ మార్చి 19 (నిజం న్యూస్):
హోలీ ఉత్సవాలు మితిమీరి పాఠశాలల ధ్వంసం కు దారితీశాయి. కొందరు హోలీ సంబరాల సందర్బంగా విందులు చేసుకునేందుకు పేకాట ఆడుకునేందుకు సెలవు కారణంగా మూసేసిన పాఠశాలను ఎంచుకొని మద్యం మత్తులో పాఠశాల లోని బెంచీలు ఫర్నిచర్ తలుపులు కిటికీలు ధ్వoసం చేసిన సంఘటనలు మండలపరిధిలో ని కోటపాడు, కందగట్ల ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం వెలుగు చూశాయివిద్యను అభ్యసించే పవిత్ర కేంద్రాలైన పాఠశాలల్లో హోలీ పండుగ అనంతరం మద్యం,విందులు చేసుకునేందుకు పాఠశాలగదులను ఎంచుకోవడమే కాకుండా పేకాట ఆడుతూ మద్యం మత్తులో ఫర్నిచర్ ను ధ్వసం చేశారు.కందగట్ల హైస్కూల్ లో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి కాళీ సీసాలు, విందు చేసుకున్న పేపర్ ప్లేట్స్ గ్లాసులు తరగతి గదుల్లో వదిలేసి వెళ్లారు.అదే విధంగా టైల్స్ పగులగొట్టి వేశారు. కోటపాడు ప్రాధమిక పాఠశాల లో పేకాట ఆడుతూ మద్యం సేవించి వెళ్ళేటప్పుడు తలుపులు కిటికీలు బెంచీలు ధ్వంసం చేసిపోయారు. కారకులైన వారిని కఠినo గా శిక్షిoహించాలని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పోలీస్ లకు శనివారం పిర్యాదు చేశారు.