రహదారిపై వెలసిన మావోయిస్టు… వాల్ పోస్టర్లు కరపత్రాలు

బోధనెల్లి రహదారిపై వెలసిన మావోయిస్టు. వాల్ పోస్టర్లు కరపత్రాలు
చర్ల మార్చి 19 ( నిజం న్యూస్) మండల పరిధిలోని బోదనెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భారత కమ్యూనిస్టు (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరట రహదారి పక్కన ఉన్న చెట్లకు వాల్ పోస్టర్లు. రోడ్డుపై కరపత్రాలు వెలిశాయి . వాల్ పోస్టర్ లో బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భారత స్వతంత్ర పోరాట విప్లవ వీరులు కామ్రేడ్ భగత్ సింగ్ .రాజ్ గురు. సుఖదేవ్ ల 90వ అమరత్వ దినం 23 మార్చి 20 22 నాడు సామ్రాజ్యవాద వ్యతిరేక దినం పాటించండి! సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రపంచ యావత్తు విప్లవోద్యమాలు. ప్రజా యుద్ధం. కాశ్మీర. ఈశాన్య జాతుల పోరాటాలు వర్ధిల్లాలి! దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల రైతుల ఆదివాసీల ప్రజాపోరాటాలకు సంఘీభావం ప్రకటిద్దాం! ప్రపంచ కార్మికులారా ఏకంకండి! మార్కిజం. లెనినిజం. మావోయిజం. వర్ధిల్లాలి! శ్రామికవర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి! ప్రపంచ సోషలిస్ట్ విప్లవం వర్ధిల్లాలి! కరపత్రాలు వెలిశాయి