స్నేహితుడి కుటుంబానికి….ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 19(నిజం న్యూస్)
ఇటీవల జనవరి నెలలో పంతంగి టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన డాకోజి రామకృష్ణ తో పాటు అతని చిన్న కుమారుడు మృతి చెందడం, భార్య లక్ష్మి , పెద్ద కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే.
అందులో భాగంగా కుటుంబ సభ్యులకు తమ వంతు గా చేయూతను అందించాలన్న సంకల్పంతో చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 1992- 93 బ్యాచ్
పదవ తరగతి మా మిత్రబృందం పోగుచేసిన 62000-00 వేల రూపాయల నగదు శనివారం నాడు రామకృష్ణ భార్య లక్ష్మి , కుటుంబ సభ్యులకు గ్రామ మున్సిపల్ కౌన్సిలర్లు కొయ్యడ సైదులు గౌడ్,కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి ల సమక్షంలో అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో
మిత్ర బృందం ముత్యాల హన్మంత రెడ్డి, సుర్వి నరసింహ గౌడ్, రవ్వ విజయ్ కుమార్,పోలోజుమాధవాచారి,సంధగళ్ళ మల్లేష్ గౌడ్, నూనె రామచంద్రం, వీరమల్ల ఓం నారాయణ దంట్టిక శంకర్ తూర్పు నూరి శ్రీనివాస్ గౌడ్ పాల్గొనడం జరిగినది.