పక్షుల దాహాన్ని తీర్చుతున్న మంద హరి.

కే యూ క్యాంపస్ మార్చి 19 నిజం న్యూస్ :
కాకతీయ యూనివర్సిటీ లో పచ్చని అడవులు మధ్య పక్షుల దాహాన్ని తీర్చేందుకు వినూత్న రీతిలో కే యూ విద్యార్థి మంద హరి పూనుకున్నాడు.యూనివర్సిటీలో సైన్స్ విద్యార్థి. వృక్షాల పైన పక్షుల దాహాన్ని తీర్చేందుకు వృక్షాలకు నీటి తొట్టె కట్టి ( బ్యాటిల్ లో నీరు పోసి) పక్షులకు,కుందేళ్ళు,నెమళ్ళు మొదలగు జీవుల దాహాన్ని తీర్చుతున్నాడు. ఎండాకాలంలో వాగులు,కాలువలు యూనివర్సిటీలో ఎండిపోవడం వల్ల మంద హరి వినూత్న ఆలోచనలను చేసి ప్రాణులకు నీరు పోసి దాహాన్ని తీర్చడంలో సంతోషం కలుగుతుందని సగటు మనిషి గా ప్రతి ఒక్కరు ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
Also read:మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమం
హరికి చిన్నప్పటి నుండి వన్యప్రాణులు,చెట్లు అన్న అమితమైన ప్రేమ.ఈయన అవిభాజ్య వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని అనంతారం నివాసి.ఇయన వన్యప్రాణులు,పక్షులు పైన, సామాజిక వర్గాల అభున్నతి కోసం,విద్యకోసం,నిరంతరం సమావేశాలు నిర్వహించి జాతిని జాగృతం చేయడం,ఇతనికి వెన్నేతో పెట్టిన విద్య. ఇతని సేవలను గుర్తించి పలువురు కే యూ అధికారులు,విద్యార్థులు అభినందిస్తున్నారు.