మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమం

— పరామర్షించిన సీపీఎం అగ్ర నాయకులు
— పార్టీ కార్యాలయానికి తీసుకుని పోవాలని కోరిన స్వరాజ్యం
స్టేట్ బ్యూరో ( నిజం, మార్చి 19):
సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు శనివారం ధ్రువీకరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో గత పది రోజులుగా మల్లు స్వరాజ్యం చికిత్స పొందుతున్న విషయం విదితమే. వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందిస్తున్నప్పటికి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడంతో ఆక్సిజన్ సహాయం తోనే ఊపిరి తీసుకుంటోంది. ఈమె ఆరోగ్యం క్షీణీస్తుండటంతో పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
సీపీఎం నాయకుల పరామర్శ: సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కేర్ ఆస్పత్రిలో మల్లు స్వరాజ్యం ను పరామర్షించారు. ఈసందర్భంగా ఆయన రెడ్ సెల్యూట్ చేయగా స్వరాజ్యం కూడా స్పందించారు. ఈ సందర్భంగా తనను నల్గొండ కేంద్రంలోని సీపీఎం జిల్లా కార్యాలయంకు తీసుక పోవాలని ఆమె కోరినట్లు సమాచారం. ఆరోగ్యం కుదుట పడి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని, భయపడవద్దని ఈ సందర్భంగా రాఘవులు ఆమెతో అన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరామర్శించినవారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, ఆమె చిన్న కుమారుడు సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, మల్లు గౌతమ్ రెడ్డి, పాదూ రి కరుణ తదితరులు న్నారు.