సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో అత్యవసర సమావేశం..

(నిజం న్యూస్ ):
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శనివారం గజ్వేల్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.