జాతీయస్థాయి కథల పోటీలో బహుమతికి ఎంపికైన తడపాకల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని

పోటీలో ఉన్న అరువందలకు పైగా కథలలో “సమానత్వం” అనే కథ ఎంపిక చేసిన నిర్వాహకులు
ఏర్గట్ల,నిజం న్యూస్19(నిజం న్యూస్): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడపాకల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న నిఖితకు జాతీయ స్థాయి కథల పోటీలో బహుమతికి ఎంపికైంది. వురిమళ్ల పౌండేషన్ ఖమ్మం వారు గత డిసెంబర్ నెలలో రెండు రాష్ట్రాలలో పాఠశాల విద్యార్థులకు కథల పోటీ నిర్వహించగా అందులో ఆరువందలకు పైగా విద్యార్థులు కథలు రాశారని అందులో నుండి అత్యుత్తమమైన ముప్పై కథలను ఎంపిక చేశారని అందులో తడపాకల్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న నిఖిత రాసిన “సమానత్వం” అనే కథ ఎంపికఅయిందని పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ప్రవీణ్ శర్మ తెలియజేశారు బహుమతికి ఎంపికైన విద్యార్థినికి త్వరలోనే నగదు బహుమతితో పాటు జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రము ను నిర్వాహకులు అందజేస్తారని ప్రవీణ్ శర్మ తెలిపారు జాతీయ స్థాయిలో బహుమతికి ఎంపికైన నిఖిత ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు ఉపాధ్యాయ బృందం గ్రామస్థులు అభినందించారు.